మహేష్ బాబుతో మహానటి ఫిక్స్

సూపర్ స్టార్ మహేష్ పరశురాం డైరక్షన్ లో చేస్తున్న క్రేజీ మూవీ సర్కారు వారి పాట. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వాని, కీర్తి సురేష్ ఇద్దరి పేర్లు వినపడ్డాయి. కియరా అద్వాని మహేష్ తో ఆల్రెడీ భరత్ అనే నేను సినిమా చేసింది. ఆ తర్వాత రాం చరణ్ తో వినయ విధేయ రామా సినిమాలో కూడా నటించింది. అయితే అమ్మడు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుండటంతో తెలుగులో స్టార్ ఛాన్సులు వచ్చినా సరే చేయనని చెబుతుందట.

అందుకే మహేష్ సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ ను ఫిక్స్ చేశారట. ఇదే విషయాన్ని మళయాళ భామ కీర్తి సురేష్ కూడా కన్ఫర్మ్ చేసింది. మహేష్ సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా తాను నటిస్తున్నట్టు చెప్పింది కీర్తి సురేష్. గీతా గోవిందం సినిమాలో రష్మికకు ఎంత క్రేజ్ వచ్చిందో ఆల్రెడీ యూత్ లో సూపర్ ఫాలోయింగ్ ఉన్న కీర్తి సురేష్ కు సర్కారు వారి పాటతో మరింత క్రేజ్ వస్తుందని అంటున్నారు. పొలిటికల్ సెటైర్ మూవీగా వస్తున్న సర్కారు వారి పాట సెప్టెంబర్ నుండి షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.