హీరోయిన్ డైరక్షన్.. 2022లో పక్కానా..!

మళయాళ భామ నిత్యా మీనన్ కెరియర్ లో చాలా వెనుకపడ్డది. అభిరుచి గల సినిమాలను మాత్రమే చేస్తూ తనకంటూ ఒక మార్క్ ఏర్పరచుకున్న నిత్యా మీనన్ ఈమధ్య తనకు నచ్చిన సినిమాలు రాకపోవడంతో ఖాళీగా ఉంటుంది. ఇక ఈ లాక్ డౌన్ టైంలో తనలోని కొత్త టాలెంట్ చూపిస్తుంది నిత్యా మీనన్. పెన్ను పట్టుకుని కథలు రాయడం మొదలుపెట్టిదట నిత్యా మీనన్.

అంతేకాదు 2022లో డైరక్షన్ కూడా చేస్తానని అంటుంది నిత్యా మీనన్. కథానాయికలు మెగా ఫోన్ పట్టడం చాలా రేర్. హీరోయిన్ గా నటించడమే కాదు డైరక్షన్ లో కూడా తన అభిరుచిని చాటుగా అంటుంది నిత్యా మీనన్. తప్పకుండా నిత్యా నుండి కొత్త కథలు.. ప్రేక్షకులను మెప్పించే సినిమాలు వస్తాయని ఆశిస్తున్నారు.