జబర్దస్త్ షూటింగ్ స్టార్ట్..!

కరోనా వల్ల మూడు నెలలుగా షూటింగ్స్ క్యాన్సిల్ కాగా ఇప్పుడిప్పుడే చిన్నగా షూటింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. తెలంగాణ, ఏపి ప్రభుత్వాలు సినిమా షూటింగ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ చేయాలని చెబుతున్నారు. ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమాల ట్రైల్ షూట్ త్వరలో చేస్తారని తెలుస్తుంది. ఈలోగా రవిబాబు క్రష్ సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు.

బుల్లితెర షూటింగ్స్ స్టార్ట్ చేశారు. టివి సీరియల్స్ కూడా మొదలుపెట్టారు. బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ కూడా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఆ విషయాన్నే వెళ్లడిస్తూ అనసూయ ట్వీట్ చేసింది. బయట పరిస్థితులు ఎలా ఉన్నా సరే జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. సంచుల కొద్దీ పచ్ణులతో జబర్దస్త్ కమెడియన్స్ చేసే కామెడీ ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పొచ్చు.