
స్టార్ సినిమాల విషయాల్లో కొన్నిసార్లు కొన్ని అద్భుతాలు జరుగుతాయి. ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరు చేయడం ఇక్కడ కామనే.. అయితే ఓ ఇద్దరు హీరోలు తమ సినిమాలను మార్చుకోవడం అదే కథలు నచ్చక సినిమాలు మిస్ అవడం ఇందస్ట్రీ హాట్ న్యూస్ గా మారింది.
సూపర్ స్టార్ మహేష్, పరశురాం డైరక్షన్ లో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంచనాలు పెంచిన ఈ సినిమా కథని డైరక్టర్ పరశురాం అల్లు అర్జున్ కోసం సిద్ధం చేసుకున్నాడట. గీతా గోవిందం తర్వాత బన్నితో సినిమా చేయాలని అనుకోగా అది క్యాన్సిల్ అయ్యింది. ఇక ఆ కథనే మార్చి మహేష్ ని మెప్పించేలా చేశాడు.
ఇక 1 నేనొక్కడినే తర్వాత సుకుమార్ మహేష్ కాంబోలో సినిమా ఉంటుందని అన్నారు. కాకపోతే మహేష్ చెప్పిన టైం వరకు వెయిట్ చేయడం కుదరక సుకుమార్ వెంటనే అల్లు అర్జున్ తో సినిమా ఎనౌన్స్ చేయించుకున్నాడు. మహేష్ కోసం రాసుకున్న పుష్ప కథనే అల్లు అర్జున్ కి చెప్పి ఒప్పించాడు. అలా మహేష్ చేయాల్సిన పుష్ప, అల్లు అర్జున్ చేయాల్సిన సర్కారు వారి పాట చేతులు మారి మహేష్ సర్కారు వారి పాట, అల్లు అర్జున్ పుష్ప చేస్తున్నారు. మరి ఈ సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.