
మెగా డాటర్ నిహారికకు పెళ్లి కుదిరిందా.. కొన్నళ్లుగా మెగా బ్రదర్ నాగబాబు త్వరలోనే నిహారిక పెళ్లంటూ ప్రస్థావించడంతో ఆ వార్తల్లో నిజం ఉందని తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా నిహారిక స్టార్ బక్స్ కాఫీ కప్ మీద Ms నిహా కొట్టేసి Mrs అంటూ పెట్టడం హాట్ న్యూస్ గా మారింది. ఓ ఐఏఎస్ ఆఫీసర్ తనయుడితో నిహారిక పెళ్లంటూ లేటెస్ట్ న్యూస్ బయటకు రాగా నిహారిక ఇన్ స్టాగ్రాంలో పెట్టిన ఈ పిక్ అది కన్ఫర్మ్ చేస్తుంది.
అయితే నిజంగానే నిహారికకు పెళ్లి కుదిరిందా లేక తను చేసే వెబ్ సీరీస్ కు ప్రమోషన్ చేస్తుందా అన్నది కూడా తెలియాల్సి ఉంది. వెబ్ సీరీస్ లతో సూపర్ సక్సెస్ అందుకున్న నిహారిక సినిమాల్లో మాత్రం ప్రేక్షకులను మెప్పించలేదు. హీరోయిన్ గా చేసిన 3 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోళ్తా కొట్టడంతో ఇక ఆ ప్రయత్నాలు మానేసి పెళ్లికి రెడీ అవుతుంది అమ్మడు. పెళ్లి తర్వాత కూడా వెబ్ సీరీస్ లు చేయాలని చూస్తుంది నిహారిక. ఇంతకీ నిహారిక పెళ్లి వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.