గురూజి.. గురూజి.. అంటూ..!

హీరోయిన్ గా క్లిక్ అవలేదు కాని ఎప్పుడు వార్తల్లో ఉండే పూనం కౌర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రం ను టార్గెట్ చేస్తూ అప్పుడప్పుడు చేసే కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతాయి. ఈమధ్య కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన అమ్మడు లేటెస్ట్ గా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకోవడంతో మళ్లీ ఆమె గురూజి అంటూ టార్గెట్ చేస్తూ ట్విట్టర్ లో సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తనని సినిమాల నుండి తప్పించడమే కాదు కొన్ని ఆడియో వేడుకల్లో కూడా లేకుండా చేశాడని.. తన మీద మీడియాలో నెగటివ్ ఆర్టికల్స్ కూడా రాయించాడని అందుకే తాను డిప్రెషన్ లోకి వెళ్లే పరిస్థితి వచ్చిందని పూనం కామెంట్ చేసింది. సావిత్రి గారి గురించి స్టేజ్ మీద గొప్పగా మాట్లాడతాడు కాని లోకల్ టాలెంట్ కు ఛాన్స్ ఇవ్వడని ఈసారి డైరెక్ట్ ఎటాక్ చేసింది పూనం కౌర్. 

అంతేకాదు సమస్యను పరిష్కరించుకుందామని తాను అంటే.. వాయిదా వేస్తూ వచ్చాడని.. తాను ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నానని చెబితే.. నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఒక రోజు వార్త అవుతావు.. అంతకుమించి ఏమి జరుగదు అని ఆ దర్శకుడు అన్నట్టు పూనం కౌర్ చేసిన ట్వీట్స్ మళ్లీ టాలీవుడ్ లో వేడి పుట్టిస్తున్నాయి. గురూజి అంటూ ఆమె ఎవరిని ఉద్దేశించి ట్వీట్స్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి వీటిపై యాక్షన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.