
టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ దశాబ్ధ కాలంగా సినిమాలైతే చేస్తున్నాడు కాని సరైన సక్సెస్ అందుకోవడంలో మాత్రం వెనుకపడ్డాడు. అయినాసరే పట్టువదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నాలు చేస్తున్నాడు సందీప్ కిషన్. ప్రస్తుతం A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్న సందీప్ కిషన్ ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో తనకు కాబోయే అమ్మాయి ఎలా ఉండాలో చెప్పాడు.
ఇప్పటివరకు తను ఎవరి ప్రేమలో పడలేదని చెప్పిన సందీప్ కిషన్ మనసుకి నచ్చిన అమ్మాయి ఇంకా తారసపడలేదని అంటున్నాడు. ఏ అమ్మాయైతే స్ట్రాంగ్, స్మార్ట్, ఇన్ స్పైరింగ్ గా ఉంటుందో అలాంటి అమ్మాయి తనకు లైఫ్ పార్ట్ నర్ గా కావాలని అంటున్నాడు సందీప్ కిషన్. పెళ్లి ఆలోచన వచ్చింది కాబట్టే సందీప్ తనకు కావాల్సిన అమ్మాయి లక్షణాలు చెబుతున్నాడని అంటున్నారు. మరి సందీప్ కిషన్ కోరుకునే క్వాలిటీస్ అన్ని ఉన్న అమ్మాయి ఎక్కడ ఎప్పుడు అతనికి ఎదురుపడుతుందో చూడాలి.