
మహానటి సినిమాతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కెరియర్ దూసుకెళ్తుంది. కరోనా ప్రభావం వల్ల షూటింగ్స్ లేట్ అవుతున్నా ఆగష్టు నుండి అమ్మడు షూటింగ్స్ కు సిద్ధమని తన డైరక్టర్స్ కు చెప్పిందట. ప్రస్తుతం కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ మూవీ ఈ నెల 19న డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతుంది. అమేజాన్ ప్రైం లో కీర్తి సురేష్ పెంగ్విన్ మూవీ రిలీజ్ అవుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో కీర్తి సురేష్ మదర్ రోల్ చేసింది.
ఇక లాక్ డౌన్ కారణంగా సినిమా మేకింగ్ చాలా కష్టమని భావించిన కీర్తి సురేష్ తన రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని నిర్ణయించుకుందట. ఇక మీదట చేసే సినిమాలకు తన రెమ్యునరేషన్ తగ్గించుకుని చేస్తుందట. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలకు కాకుండా ఇకమీదట చేసే సినిమాలకు రెమ్యునరేషన్ తగ్గించి తీసుకోవాలని అనుకుంటుంది కీర్తి సురేష్. అమ్మడు తీసుకున్న ఈ నిర్ణయం దర్శక నిర్మాతలకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు.