
అందాల రాక్షసి హీరో నవీన్ చంద్ర హీరోగా నిలబడటానికి ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కేవలం హీరోగానే కాదు విలన్ గా కూడా చేస్తూ వస్తున్న నవీన్ చంద్ర ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా సరే చేస్తున్నాడు. లేటెస్ట్ గా అతను హీరోగా తెరకెక్కిన సినిమా భానుమతి రామకృష్ణ. ఈ సినిమాను ఓటిటి రిలీజ్ కోసమే తెరకెక్కించారు. జూలై మొదటివారంలో రిలీజ్ చేయాలని అనుకున్న ఈ సినిమాకు మనోభావాల సమస్య వచ్చి పడ్డది.
ఈమధ్య ప్రతి సినిమాకు ఏదో ఒకవిధంగా మా మనోభావాలు దెబ్బతినాయ్ అంటూ గొడవ చేయడం కామన్ అయ్యింది. భానుమతి రామకృష్ణ సినిమాకు కూడా భానుమతి పేరుని వాడుకున్నందుకు భానుమతి కుటుంబ సభ్యులు చిత్రయూనిట్ పై కేసు వేసేందుకు సిద్ధమయ్యారు. భానుమతి పేరుని టైటిల్ లో తొలగిస్తేనే సినిమా రిలీజ్ అవుతుందని.. లేదంటే కేసు పెడతామని చెబుతున్నారట. సినిమాలో భానుమతి గారిని కించపరచే సన్నివేశాలు ఏమి లేవని చిత్రయూనిట్ చెబుతుంది. ప్రస్తుతం భానుమతి ఫ్యామిలీతో చిత్ర దర్శక నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు.