నాకు చాలా లోతైన గాయాలు తగిలాయి..!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ తర్వాత బాలీవుడ్ లో నెపోటిజంపై చర్చలు జరుగుతున్నాయి. సిని పరిశ్రమలో నట వారసత్వం ఉండటం వల్లే సుశాంత్ సింగ్ లాంటి నటులు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని సోషల్ మీడియాలో నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. నెపొటిజం మీద విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 

నేను ఎన్నో గాయాలు తట్టుకుని ఇక్కడ నిలబడ్డాను.. కాని సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వల్ల అది కాలేదు. నెపోటిజం నుండి నేను బయటపడ్డాను. నా గాయాలు చాలా లోతైనవి. అయినా నేను తట్టుకోగలిగను.. ఇప్పటికైనా నేర్చుకుందాం.. వారు కన్న కలలు చనిపోనివ్వకుండా నిలబెడదాం అంటూ ప్రకాశ్ రాజ్ ఎమోషనల్ మెసేజ్ చేశారు. అంతేకాదు నెపోటిజంపై సుశాంత్ మాట్లాడిన వీడియోని కూడా షేర్ చేశారు ప్రకాశ్ రాజ్.