
అల వైకుంఠపురములో సినిమా సూపర్ హిట్ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఆ సినిమాతో మరోసారి తనలోని ఉన్న మాస్ యాంగిల్ చూపించనున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచిన బన్ని ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేశాడు.
శేషాచలం అడవుల నేపథ్యంతో సుకుమార్ రాసుకున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ కేరళ అడవుల్లో షూట్ చేశారు. అయితే ఇప్పుడు అక్కడ షూట్ చేయడానికి పర్మిషన్ వచ్చేలా లేదు. ఆ తర్వాత తూర్పు గోదావరి లో కూడా సినిమా కోసం లొకేషన్ సెర్చ్ చేశారు. అయితే అక్కడ కూడా షూటింగ్ కష్టమని భావించి అన్నపూర్ణ స్టూడియోలో ఫారెస్ట్ సెట్ వేయిస్తున్నారట. ఈ సెట్ కోసం భారీ ఖర్చు అయ్యేలా ఉన్నా ఇప్పుడు అవుట్ డోర్ షూటింగ్ చాలా కష్టమయ్యేలా ఉంది కాబట్టి అన్నపూర్ణలో సెట్ వేయక తప్పేట్టు లేదని తెలుస్తుంది. ఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్, బన్ని కాంబినేషన్ లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. 2021 సంక్రాంతికి రిలీజ్ చేసేలా షెడ్యూల్ ఫిక్స్ చేశారు. మరి మధ్యలో మళ్లీ కరోనా ఎఫెక్ట్ పెరిగి షూటింగ్ క్యాన్సిల్ చేస్తే అనుకున్న టైం కు రిలీజ్ చేయడం కష్టం అవుతుంది.