
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా భరత్ కమ్మ డైరక్షన్ లో వచ్చిన సినిమా డియర్ కామ్రేడ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాలతో రాగా అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయ్యింది. గీతా గోవిందం సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న ఈ జోడీ డియర్ కామ్రేడ్ తో అలరిస్తారని అనుకోగా నిరాశపరచారు.
అయితే తెలుగులో ఫ్లాపైన ఈ సినిమాను బాలీవుడ్ ఆడియెన్స్ మాత్రం తెగ చూసేస్తున్నారు. డియర్ కామ్రేడ్ సినిమా హింది డబ్బింగ్ వర్షన్ రికార్డ్ వ్యూస్ సాధితుంది. ఇప్పటికే ఈ సినిమాకు 130 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక విశేషం ఏంటంటే 1.6 మిలియన్ లైక్స్ కూడా రాబట్టింది. స్టార్ సినిమాలకు కూడా రాని లైక్స్ డియర్ కామ్రేడ్ కు వచ్చాయి.
బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ఈ వ్యూస్, లైక్స్ చూస్తే అర్ధమవుతుంది. అందుకే పూరి జగన్నాథ్ డైరక్షన్ లో సినిమాను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ ప్లాన్ చేశారు. డియర్ కామ్రేడ్ సినిమా కూడా తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో రిలీజైంది. కాని అన్నిచోట్ల ఫ్లాప్ గా నిలిచింది.