సుశాంత్ సూసైడ్ కు వాళ్లే కారణం..!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి పట్ల స్పందించిన క్రేజీ హీరోయిన్ కంగనా రనౌత్ సుశాంత్ వాళ్లను నమ్మడం వల్లే ఇలా జరిగిందని అన్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్లను ఇక్కడ ఎదగనివ్వరని తేల్చి చెప్పింది. సుశాంత్ చాలా మంచి నటుడని.. కైపోచె సినిమాకు బెస్ట్ డెబ్యూ రావాల్సినా రానివ్వకుండా చేశారని అన్నారు కంగనా. చిచ్చోరే వంటి సందేశాత్మక సినిమా చేసినా దానికి అవార్డులు ఇవ్వలేదని అన్నారు. ఆ టలెంటెడ్ యాక్టర్ కు అవార్డ్ ఎందుకు రాలేదు..? స్టాంఫోర్డ్  యూనివర్సిటీ స్కాలర్ షిప్ సాధించిన వ్యక్తి మానసికంగా ఎలా బలహీనంగా ఉంటాడు..? అంటూ ప్రశ్నించింది కంగనా.   

బాలీవుడ్ బడా బాబుల ప్లాన్ ప్రకారంగానే ఇదంతా జరిగిందని.. ఎవరు కొత్తగా వచ్చినా వెనక్కి లాగుతారు.. బ్యాడ్ రివ్యూస్ రాయించి కెరియర్ తొక్కేస్తారు.. సుశాంత్ ను డ్రగ్స్ బానిసగా కూడా చూపించే ప్రయత్నం చేశారు. అలాంటి వాళ్లకు సంజయ్ దత్ మాత్రం కనబడరంటూ ఫైర్ అయ్యారు. బాలీవుడ్ పెద్దల ఒత్తిడి కారణంగానే సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడని.. అతని మరణానికి వాళ్లే కారణమని చెబుతున్నారు. కంగనా రెండు నిమిషాలకు పైగా రిలీజ్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.