
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి కేరాఫ్ కంచెరపాలెం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరక్టర్ వెంకటేష్ మహా తన సెకండ్ మూవీని కూడా అంచనాలను అందుకునేలా ఉన్నాడు. సత్యదేవ్ హీరోగా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాను తీసిన వెంకటేష్ మహా ఆ సినిమాను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు. ఆర్కా మీడియా నిర్మించిన ఈ సినిమా మొత్తం మూడున్నర కోట్ల బడ్జెట్ తో పూర్తి చేయగా నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను 4 కోట్లకు కొనేసిందట.
డిజిటల్ రిలీజ్ చేసినా సరే ఉమామహేశ్వర్ సినిమాకు లాభాలు వచ్చినట్టే. ఇక దీనితో పాటుగా మరో రెండు నుండి మూడు కోట్ల దాకా శాటిలైట్ రైట్స్ వచ్చే అవకాశం ఉంది. సో మొత్తానికి లాక్ డౌన్ టైం లో ఈ సినిమా డిజిటల్ రిలీజ్ అవుతున్నా సరే దర్శక నిర్మాతలకు లాభాలు తెచ్చిందని చెప్పొచ్చు. ఈ సినిమాను ఈ నెల చివర్లో కాని జూలై మొదటివారంలో కాని నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది.