మెగా నిర్మాణంలో రాజశేఖర్ మూవీ..!

ఈమధ్య తెలుగు దర్శక నిర్మాతలు రీమేక్ సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మన సినిమాలు వేరే భాషల్లో రీమేక్ అవుతున్నాయి. 2018లో క్రైం థ్రిల్లర్ మూవీగా మళయాళంలో సూపర్ హిట్ అయిన సినిమా జోసెఫ్. ఆ సినిమా రీమేక్ రైట్స్ అందుకున్న అల్లు అరవింద్ ఈ సినిమాను పలాస డైరక్టర్ కరుణ కుమార్ తో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా యాంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్ నటిస్తారని తెలుస్తుంది.  

సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో రాజశేఖర్ కనిపిస్తారట. రాజశేఖర్ ఇమేజ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని ఈ సినిమాలో ఆయన్ను హీరోగా ఎంచుకున్నారట. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సినిమా అంటే అది మినిమం గ్యారెంటీ అన్నట్టే. గరుడవేగ సినిమాతో హిట్ అందుకున్న రాజశేఖర్ కల్కితో మెప్పించినా ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు మళయాళ సినిమా జోసెఫ్ తెలుగు రీమేక్ లో నటిస్తారని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు ఈ సినిమాను నిర్మిస్తారట. ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ బయటకు రావాల్సి ఉంది.