అనుష్క నుండి మరో భాగమతి..!

స్వీటీ అనుష్క భాగమతి తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో కోనా వెంకట్ నిర్మాణంలో నిశ్శబ్ధం సినిమాలో నటించింది. ఆ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా లేటెస్ట్ గా అమ్మడు మరో క్రేజీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. యువి క్రియేషన్స్ లో అనుష్క నటించిన భాగమతి సినిమా రెండేళ్ల క్రితం వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే టీంతో మరోసారి పనిచేస్తుందట అనుష్క. బ్యానర్, ప్రొడ్యూసర్ వాళ్లే కాని డైరక్షన్ అశోక్ చేస్తున్నాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. 

ఫీమేల్ లీడ్ సబ్జెక్ట్ తోనే ఈ సినిమా కూడా వస్తుందని తెలుస్తుంది. డైరక్షన్ చేసేది అశోక్ అని తెలిస్తే మాత్రం అది కచ్చితంగా భాగమతి సీక్వల్ అని అంచనా వేయొచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన భాగమతి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా తర్వాత అనుష్క సెలెక్టెడ్ మూవీస్ చేయాలని చూస్తుంది. మరి యువితో అనుష్క చేస్తున్న ఈ సినిమా భాగమతి రిజల్ట్ రిపీట్ చేస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాతో పాటుగా తమిళంలో ఒక సినిమా ఓకే చేసింది అనుష్క. లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసిన తర్వాతనే ఈ సినిమా షూటింగ్స్ మొదలవుతాయని తెలుస్తుంది.