
గుంటూర్ టాకీస్ తో సత్తా చాటిన ప్రవీణ్ సత్తారు ఆ తర్వాత యాంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్ తో గరుడవేగ సినిమా చేశాడు. ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రవీణ్ సత్తారు ఆ సినిమా సీక్వల్ నే తన నెక్స్ట్ సినిమాగా చేయాలని అనుకున్నారు. కాని అప్పటినుండి ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.
ఇక లేటెస్ట్ గా ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ప్రవీణ్ సత్తారు రీసెంట్ గా కింగ్ నాగార్జునకు ఓ స్టోరీ నెరేట్ చేశారట. కథ నచ్చిన నాగ్ వెంటనే అతనితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆఫీసర్, మన్మధుడు 2 సినిమాల ఫ్లాప్ తో కెరియర్ లో వెనుకపడ్డ నాగార్జున ప్రస్తుతం సోలమన్ డైరక్షన్ లో వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రవీణ్ సత్తారు సినిమానే సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు. టాలెంటెడ్ డైరక్టర్ తో కింగ్ నాగార్జున చేస్తున్న ఈ ప్రాజెక్ట్ షురూ అయితే కచ్చితంగా అంచనాలు ఏర్పడటం ఖాయం.