విశ్వక్ సేన్ ఓ రీమేక్.. అసలు కథ ఇది..!

యువ హీరో విశ్వక్ సేన్ ఈనగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్, హిట్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్నాడు. సినిమాల్లో కన్నా ఆ సినిమాల పబ్లిసిటీ టైం లో మనోడి నోటి దురుసు వల్ల ఎక్కువ వార్తల్లో ఉంటాడు అనుకోండి. విశ్వక్ సేన్ టాలెంట్ మెచ్చి నాని నిర్మాతగా మారి హిట్ సినిమా చేశాడు. శైలేష్ డైరెక్ట్ చేసిన ఆ సినిమా సీక్వల్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత విశ్వక్ సేన్ కోలీవుడ్ రీమేక్ లో నటిస్తాడని వార్తలు వచ్చాయి. తమిళంలో సూపర్ హిట్టైన ఓ మై కడవులే సినిమా రీమేక్ లో విశ్వక్ సేన్ నటిస్తున్నాడని.. పివిపి బ్యానర్ లో ఈ సినిమా వస్తుందని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఓ యువజంట ప్రేమ, పెళ్లి, విడాకులు ఈతరం యువత ఆలోచనలకు అద్దం పట్టేలా తెరకెక్కించిన ఈ సినిమాను పివిపి తెలుగు రీమేక్ రైట్స్ కొన్నారు. అయితే ఈ సినిమాను విశ్వక్ సేన్ కన్నా ముందు ఇద్దరు ముగ్గురు హీరోల దగ్గరకు తీసుకెళ్తే వాళ్లు చేయనని చెప్పారట. ఫైనల్ గా విశ్వక్ సేన్ కూడా ఈ రీమేక్ కు నో చెప్పడంతో పివిపి ఈ సినిమాను ఎవరితో తీయాలో సందిగ్ధంలో పడ్డాడట. ఓ మై కడవులే సినిమాను తెలుగులో ఏ హీరో రీమేక్ చేస్తాడో చూడాలి.