
కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో సూపర్ ఫాంలో ఉంది. ఇక్కడ స్టార్స్ కు మొదటి ఆప్షన్ అయిన రష్మిక కన్నడలో కూడా వరుస ఛాన్సులు అందుకుంటుంది. ఈ ఇయర్ మొదట్లో సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమతో హిట్ అందుకున్న రష్మిక, అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా కన్నడలో రక్షిత్ శెట్టి హీరోగా వస్తున్న కిరాక్ పార్టీ సీక్వల్ కి కూడా ఓకే అన్నదట.
కిరాక్ పార్టీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న రష్మిక ఆ సినిమా తర్వాత రక్షిత్ శెట్టితో ప్రేమలో పడటం.. ఎంగేజ్మెంట్ కూడా జరుగగా పెళ్లికి ముందు ఏవో కారణాల వల్ల ఎవరి దారి వారు చూసుకున్నారు. అప్పటినుండి రక్షిత్ శెట్టి విషయంపై సైలెంట్ గా ఉంటూ వస్తున్న రష్మిక కిరాక్ పార్టీ సీక్వల్ ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని అంటుంది. మరి మళ్లీ మాజి ప్రేమికుడితో రష్నిక సినిమా అనగానే మళ్లీ తన మనసు మార్చుకుందేమో అంటున్నారు.