
మూడు నెలల తర్వాత సినిమా షూటింగ్స్ కు షురూ చేయడంతో ప్రభుత్వ సూచనల ప్రకారంగా షూటింగ్స్ చేస్తున్నారు. ఇక కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్ధిక సంక్షోభం వల్ల నిర్మాతలు చాలా నష్టాలపాలయ్యారు. పరిశ్రమ మేలుకోరి నిర్మాతల గిల్డ్ వారు 24 క్రాఫ్టుల వారికి 25 శాతం రెమ్యునరేషన్ లో కోత విధిస్తున్నారు.
కేవలం స్టార్స్ మాత్రమే కాదు డైరక్టర్స్, మ్యూజిక్ డైరక్టర్స్, లీడ్ ఆర్టిస్టులు, మిగతా టెక్నికల్ టీం వారు కూడా వారి రెమ్యునరేషన్ లో పాతిక శాతం కట్ చేసుకోవాల్సిందే అంటున్నారు. అయితే రెమ్యునరేషన్ కటింగ్ విషయంపై స్టార్స్ ఎలా స్పందిస్తారు.. వారు దీనికి ఒప్పుకుంటారా లేదా.. రెమ్యునరేషన్ కోత అందరికి ఒకేవిధంగా వర్తిస్తుందా లేదా అన్న విషయాల మీద వివరాలు బయటకు రావాల్సి ఉంది.