చచ్చిపోయే అభిమానం వద్దు..!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ స్టార్ క్రేజ్ తెచ్చుకునేందుకు చాలా కష్టపడ్డది. అందం కన్నా తన అభినయంతో మెప్పించే ఈ అమ్మడు తెలుగులో రెండు సినిమాలే చేసినా తమిళంలో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది. లేటెస్ట్ గా తన సోషల్ బ్లాగ్ లో ఓ పిక్ పెట్టింది ఐశ్వర్య రాజేష్. సోషల్ మీడియాలో అది వైరల్ అవడమే కాకుండా త్రిష లాంటి హీరోయిన్స్ సైతం ఆ పిక్ ను లైక్ చేయడం జరిగింది. అంతేకాదు ఐశ్వర్యా రాజేష్ ఆ ఫోటోని దాదాపు రెండు లక్షల మంది వరకు లైక్ చేయడం విశేషం. 

ఇక ఆ ఫోటోకు ఐశ్వర్య రాజేష్ వీరాభిమాని ఒకరు, ఐష్ నీ కోసం చచ్చిపోతా.. నీ నటన అంటే పిచ్చి, మీ కోసం నా ప్రాణాలైనా ఇచ్చేస్తా.. మీరంటే నాకు చాలా ఇష్టం అక్కా అని ఓ నెటిజెన్ కామెంట్ పెట్టాడు. ఆ మెసేజ్ చూసిన ఐశ్వర్యా రాజేష్ చాలా ఎమోషనల్ అయ్యారు. నన్ను అభిమానిస్తున్నందుకు ధన్యవాదములు.. కాని నా కోసం చచ్చిపోతాననడం మాత్రం బాగాలేదు. అలాంటి మాటలు మాట్లాడొద్దు.. నువ్వు హ్యాపీగా ఉన్నావని చెబితే చాలు.. ఓ మనిషి కోసం చనిపోడానికి కాదు మనం జీవించేది.. నేనెప్పుడు నీకు మంచి ఫ్రెండ్ గా ఉండాలంటే ఇంకెప్పుడు ఇలా చచ్చిపోతానని అనొద్దని గట్టిగా క్లాస్ పీకింది ఐశ్వర్య. తమిళంలో హీరోయిన్స్ కు గుడి కట్టే సంప్రదాయం ఉంది. చూస్తుంటే నెక్స్ట్ ఆ లిస్ట్ లో ఐశ్వర్యా రాజేష్ ఉంటుందని అంటున్నారు.

View this post on Instagram

❤️❤️❤️Clicked @antonyfernandophotography

A post shared by Aishwarya Rajessh (@aishwaryarajessh) on