నా పెళ్ళికి నన్ను పిలుస్తారా..?

నా పెళ్ళికి నన్ను పిలుస్తారానా.. అదేంటి టైటిల్ విచిత్రంగా ఉందని అంటున్నారు కదా కోలీవుడ్ భామ హాన్సిక మోత్వానీ డైలాగ్ దాదాపుగా ఇలానే ఉన్నాయి. పూరి డైరక్షన్ లో వచ్చిన దేశముదురు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తెలుగు, తమిళ భాషల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో కన్నా తమిళంలో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ఓ బిజినెస్ మెన్ తో లవ్ లో పడ్డదని.. తననే పెళ్లి చేసుకుంటుందని మీడియాలో వార్తలు వచ్చాయి. 

ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో తనకు పెళ్లంటూ వచ్చిన వార్తల మీద వెరైటీగా స్పందించింది హాన్సిక. తన పెళ్ళికి తనని పిలుస్తారా అంటూ ఆమె అడగడం షాకింగ్ గా మారింది. కోలీవుడ్ లో సెన్సేషనల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న హాన్సిక తెలుగులో మొదట్లో హడావిడి చేసినా సరే తమిళంలో మాత్రం సూపర్ సక్సెస్ అయ్యింది. కోలీవుడ్ హీరో శింబుతో ప్రేమాయణం ముగించిన హాన్సిక బిజినెస్ మెన్ తో పెళ్లిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ న్యూస్ గా మారాయి.