
కరోనా వల్ల లాక్ డౌన్ విధించగా ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన హీరోయిన్స్ ఇప్పుడిప్పిడే బయటకు వస్తున్నారు. లేటెస్ట్ గా టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పీపీఈ సూట్ ధరించి ఎయిర్ పోర్ట్ లో కనిపించగా అమ్మడి బాటలోనే ఆరెక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ ఫుత్ కూడా ఒంటినిండా డ్రెస్ వేసుకుని ముంబై ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చింది. లాక్ డౌన్ టైం లో ఇళ్లల్లో ఉన్న ఈ భామలు ప్రస్తుతం తమ పనుల నిమ్మిత్తం బయటకు వస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్స్ కు ఓకే చెప్పగా త్వరలోనే ఆంక్షలతో కూడిన షూటింగ్స్ కు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం సగం పూర్తైన సినిమాలకు మాత్రమే మొదట మొదలుపెట్టే ఆలోచన ఉందదని తెలుస్తుంది. లాక్ డౌన్ 4 కొనసాగుతున్నా తగిన జాగ్రత్తలతో పనులు చేసుకోవాలని ప్రభుత్వ సూచనలు ఉన్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ ఎత్తేసిన దగ్గర నుండి రోజు రోజుకి కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఇలాంటి టైంలో సినిమా షూటింగ్స్ ఎలా జరుగుతాయో చూడాలి.