
ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ అందుకున్న ఇద్దరు క్రేజీ భామలకు టాలీవుడ్ లో మంచి ఛాన్సులు వస్తున్నాయి. ఓ పక్క నిధి అగర్వాల్ వరుస ఛాన్సులతో దూసుకెళ్తుంటే.. మరోపక్క నభా నటేష్ కూడా అదరగొట్టేస్తుంది. నభా నటేష్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చెతికి చిక్కింది.
కన్నడలో అప్పటికే మూడు సినిమాలు చేసిన నభా నటేష్ తెలుగులో సుధీర్ బాబు హీరోగా చేసిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఇక ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ హిట్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నభా నటేష్ ప్రస్తుతం రామ్ రెడ్ తో పాటుగా మరో సినిమా చేస్తుంది. లటెస్ట్ గా అమ్మడికి నితిన్ సరసన నటించే ఛాన్స్ వచ్చింది.
బాలీవుడ్ లో సూపర్ హిట్టైన అందాధున్ రీమెక్ గా తెలుగులో ఓ సినిమా వస్తుంది. నితిన్ హీరోగా మేర్లపాక గాంధి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నభా నటేష్ లాక్కీ ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. ఈ సినిమాతో చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్ భామ శిల్పా శెట్టి కూదా తెలుగులో నటించడానికి ఒప్పుకుందని తెలుస్తుంది.