
ఒకప్పుడు వరుస సినిమాలతో సూపర్ హిట్లతో సూపర్ ఫాం కొనసాగించిన అల్లరి నరేష్ హిట్టు కొసం తపించిపోతున్నాడు. లాస్ట్ ఇయర్ సూపర్ స్టార్ మహేష్ మహర్షి సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన అల్లరి నరేష్ ప్రస్తుతం బంగారు బుల్లోడు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను గిరి డైరెక్ట్ చేస్తున్నారు.
ప్రస్తుతం కరోనా ప్రభావంతో లాక్ డౌన్ వల్ల చిన్న సినిమాలన్ని ఓటిటి లో రిలీజ్ అవుతున్నాయి. వాటి దారిలోనే అల్లరి నరేష్ బంగారు బుల్లోడు సినిమా కూడా ఓటిటి రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అప్పుడెప్పుడో ఒళ్లంతా బంగారంతో క్రేజీ పోస్టర్ రిలీజ్ చేసిన బంగారు బుల్లోడు టీం త్వరలో సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాతో హెరోగా తిరిగి ఫాంలోకి రావాలని చూస్తున్నాడు అల్లరి నరేష్.