24 సీక్వల్ తో విక్రమ్..?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన సినిమా 24. టైం ట్రావెల్ నేపథ్యంతో వచ్చిన ఆ సినిమా తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించింది. మనం తర్వాత విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన 24 సినిమా కమర్షియల్ గా కూడా వర్క్ అవుట్ అయ్యింది. నానితో గ్యాంగ్ లీడర్ సినిమా చెసిన విక్రం కె కుమార్ ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా మూవీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు థ్యాంక్యూ అని టైటిల్ పరిశీలణలో ఉంది. ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత విక్రం కె కుమార్ మరోసారి సూర్య తో సినిమా చేస్తారని తెలుస్తుంది. 

సూర్య, విక్రం కె కుమార్ కాంబో అనగానే అందరికి 24 సినిమా గుర్తుకొస్తుంది. ఈ సినిమా దానికి సీక్వల్ గా ఉంటుందని అందరు అంటున్నారు. సూర్యతో విక్రం కుమార్ 24 కి సీక్వల్ గాని, ప్రీక్వల్ కాని తెరకెక్కిస్తారని అంటున్నారు. ప్రస్తుతం సూర్య సుధ కొంగర డైరక్షన్ లో ఆకాశమే హద్దు సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రెక్షకుల ముందుకు రాబోతుంది.