
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ రాబోతుంది. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ నందమూరి ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. బిబి 3 టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ సినిమాలో సునీల్ విలన్ గా నటిస్తాడని తెలుస్తుంది. కమెడియన్ గా అలరించిన సునీల్ హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. కానీ హీరోగా కెరియర్ లో వెనుక పడటంతో మళ్ళీ కమెడియన్ గా టర్న్ తీసుకున్నాడు.
ఇక ఈ సినిమాలో విలన్ గా సునీల్ నటిస్తాడని తెలుస్తుంది. కమెడియన్ గా అలరించిన సునీల్ హీరోగానే కాదు ఒకటి రెండు సినిమాల్లో విలన్ గా కనిపించి అలరించాడు. ఇప్పుడు బోయపాటి బాలకృష్ణ కాంబోలో విలన్ గా చేసి ఫుల్ టైం విలన్ గా సెటిల్ అవ్వాలని చూస్తున్నాడు. విలన్ గా క్లిక్ అయితే సునీల్ మళ్ళీ కొన్నాళ్ళు ఫామ్ కొనసాగించేలా అవకాశం ఉంది. ఇంతకీ ఈ సినిమాలో సునీల్ ఉన్నాడా లేడా ఉంటే నిజంగా విలన్ గానే చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.