ప్రభాస్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్..!

కొన్నాళ్లుగా మీడియా ముందుకు రాని ప్రభాస్ లేటెస్ట్ గా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేసి సర్ ఫ్రయిజ్ చేశాడు. తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్ విసిరినా ఈ ఛాలెంజ్ ను ఇన్నాళ్లకు పూర్తి చేశాడు ప్రభాస్. ఈ కార్యక్రమంలో ప్రభాస్ తో పాటుగా TRS ఎంపీ సంతోష్ కూడా పాల్గొన్నారు. ఇద్దరు కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోసం రెండు మొక్కలను నాటారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. 

ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరక్షన్ లో భారీ మూవీ చేస్తున్నాడు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఇంటర్నేషనల్ లెవల్ లో తెరకెక్కిస్తున్నారట. వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.