
ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని అంటున్నారు. కెజిఎఫ్ తో సత్తా చాటిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కెజిఎఫ్ చాప్టర్ 2 చేస్తున్నాడు. ఈ ఇయర్ ఎండింగ్ లో ఈ మూవీ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. కెజిఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మిస్సైల్ టైటిల్ పెడుతున్నట్టు తెలుస్తుంది. తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తారని అంటున్నారు. కెజిఎఫ్ 2 సూపర్ హిట్టయితే ఎన్టీఆర్ మూవీకి కూడా భారీ అంచనాలు ఏర్పడుతాయి. మరి ఈ క్రేజీ కాంబో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.