
దగ్గుబాటి రానా, మిహీక బజాజ్ ల లవ్ మ్యారేజ్ ఈమధ్యనే కన్ఫర్మ్ అయ్యింది. రోకా ఫంక్షన్ జరుగగా కుటుంబ సభ్యుల సమక్షంలోనే త్వరలోనే ఎంగేజ్మెంట్ జరుగుతుందని తెలుస్తుంది. అయితే ఆగష్టు 8న రానా, మిహీకల మ్యారేజ్ అని అంటున్నారు. అయితే అప్పటికల్లా కరోనా తగ్గితే ఒకలా.. కరోనా తీవ్రత పెరిగితే మరోలా అంటూ రెండు ప్లాన్లు రెడీ చేశారట. కరోనా తగ్గుముఖం పడితే ఇండస్ట్రీ అంతా ఒక్కచోట చేరేలా వేడుక జరుగుతుందట.
ఒకవేళ కరోనా అప్పటికి ఇంకా ఎక్కువవుతుంది అనుకుంటే మాత్రం కేవలం కొద్ధిమంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే మ్యారేజ్ కూడా జరిపేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే పెళ్లి డేట్ మాత్రం లేదని అంటున్నారట. సో అతిధులు తగ్గే అవకాశం ఉంటుంది కానీ మ్యారేజ్ డేట్ మాత్రం మార్చే అవకాశం లేదని తెలుస్తుంది.