పెంగ్విన్ ట్రైలర్.. కీర్తి సురేష్ థ్రిల్లర్ అటెంప్ట్

మహానటి తర్వాత కీర్తి సురేష్ మిస్ ఇండియా సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా తర్వాత తెలుగు, తమిళ భాషల్లో పెంగ్విన్ సినిమా చేసింది.  నిర్మించిన ఈ సినిమాను ఈశ్వర్ కార్తీక్ డైరెక్ట్ చేశారు. కొడుకుని మిస్సైన ఓ మదర్ కథతో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా వస్తుంది. ఈమధ్య రిలీజైన టీజర్ తో అలరించిన పెంగ్విన్ సినిమా నుండి లేటెస్ట్ గా ట్రైలర్ వదిలారు.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను జూన్ 19న  రిలీజ్ చేస్తున్నారు. మీ అందరి కథల వెనుక ఓ అమ్మ కథ ఉంది. ఎందుకంటే మీ ప్రయాణం ప్రారంభించేది ఆమె నుంచే అంటూ టీజర్ తో మెప్పించిన కీర్తి సురేష్ పెంగ్విన్ ట్రైలర్ తో సర్ ప్రయిజ్ చేసింది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండగా తప్పకుండా సినిమా అంచనాలను అందుకుంటుందని అంటున్నారు. లాక్ డౌన్ లో ఓటిటిలో రిలీజ్ అవుతున్న ఈ పెంగ్విన్ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.