
సూపర్ స్టార్ మహేష్ 27వ సినిమా సర్కారు వారి పాట పరశురామ్ డైరక్షన్ లో వస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ కలిసి నిర్మిస్తున్న సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వానీ, కీర్తి సురేష్ ల పేరులు వినపడుతున్నాయి. ఆ ఇద్దరిలో ఎవరు ఫైనల్ అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఇక సినిమాలో విలన్ గా కన్నడ హీరో సుదీప్ నటిస్తున్నాడని తెలుస్తుంది.
సర్కారు వారి పాట పొలిటికల్ సెటైర్ నేపథ్యంతో వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తాడట. ముందు బాధ్యత లేని వ్యక్తిగా కనిపించినా తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల హీరో మారిపోతాడట అప్పటినుండి సినిమా కథ మారిపోతుందని అంటున్నారు. గీతా గోవిందం తర్వాత తీస్తే స్టార్ తోనే సినిమా చేయాలని అనుకున్న పరశురామ్ కు మహేష్ డేట్స్ ఇవ్వడంతో సర్కారు వారి పాట సెట్ అయింది. మరి ఈ సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.