గోపీచంద్ రిజెక్ట్ చేస్తే రానా యాక్సెప్ట్ చేశాడా..?

పర్ఫెక్ట్ మాస్ స్టార్ హీరో కావాల్సిన కటౌట్ ఉన్నా.. ఓ మోస్తారు క్రేజ్ తెచ్చుకున్న హీరో గోపీచంద్. యజ్ఞం సినిమా నుండి చాణక్య వరకు ప్రతి సినిమాలో ఏదో ఒక విషయం ఉండేలా జాగ్రత్త పడుతున్న గోపిచంద్ కొద్దిపాటి గ్యాప్ తో తేజ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. తేజ డైరెక్ట్ చేసిన జయం, నిజం సినిమాల్లో విలన్ గా నటించిన గోపిచంద్ హీరోగా మారి మాస్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. 

ప్రస్తుతం సంపత్ నంది డైరక్షన్ లో సీటీమార్ సినిమా చేస్తున్న గోపిచంద్ తన నెక్స్ట్ మూవీ తేజ డైరక్షన్ లో ఉంటుందని తెలిసిందే. అయితే ఈ సినిమాకు బదులుగా అసలైతే రానా చేస్తున్న విరాటపర్వం సినిమా గోపిచంద్ చేయాల్సిందట. నీది నాది ఒకే కథ సినిమా డైరెక్ట్ చేసిన వేణు ఊడుగుల విరాటపర్వం కథను ముందు గోపిచంద్ కు వినిపించాడట. కాని గోపిచంద్ ఎందుకో ఆ ప్రాజెక్ట్ చెయలేనని చెప్పారట. గోపిచంద్ రిజెక్ట్ చేసిన ఆ సినిమాను రానాతో ఫిక్స్ చేసుకున్నాడు వేణు. సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.