
ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాలో కొమరం భీం పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ ఆ మూవీ తర్వాత త్రివిక్రమ్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలిసిందే. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తారని తెలుస్తుంది. అల వైకుంఠపురములో సక్సెస్ తో తన సత్తా చాటిన త్రివిక్రమ్ తారక్ తో పొలిటికల్ టచ్ ఉన్న స్టోరీతో సినిమా చేస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో హీరో ఎన్నారైగా కనిపిస్తాడట. ఇండియాకు వచ్చి ఇక్కడ రాజకీయ పరిస్థితులు చూసి మార్పు తీసుకురావాలని అనుకుంటాడట.
త్రివిక్రమ్ తో తారక్ ఇంతకుముందు చేసిన సినిమా అరవింద సమేత. ఈ సినిమా కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తోనే తెరకెక్కించాడు త్రివిక్రమ్. మరోసారి అలాంటి నేపథ్యం ఉన్న కథతోనే ఈసారి సరికొత్త కథ, కథనాలతో వస్తున్నాడట త్రివిక్రమ్. ఆర్.ఆర్.ఆర్ పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట. అప్పటివరకు త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ చేస్తారని తెలుస్తుంది. ఈ మూవీకి అయినను పోయి రావలె హస్తినకు టైటిల్ పరిశీలనలో ఉంది.