
మలయాళంలో సూపర్ హిట్టైన అయ్యప్పనుమ్ కోషియం సినిమా తెలుగు రీమేక్ కు ప్రయత్నాలు మొదలయ్యాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ మలయాళం సినిమా తెలుగు రైట్స్ కొనేశారు. పృథ్వి రాజ్, బిజూ మీనన్ కలిసి నటించిన ఆ సినిమా తెలుగు రీమేక్ లో రవితేజ, రానా కలిసి చేస్తారని తెలుస్తుంది. ఇక ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్న విషయంపై కొన్నాళ్లుగా చర్చలు జరుగుతుంది.
ఫైనల్ గా ఈ రీమేక్ కు సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. స్వామిరారా సినిమా నుండి రణరంగం వరకు టేకింగ్, డైరక్షన్ లో ఎప్పుడు ఫెయిల్ అవని సుధీర్ వర్మ అయితేనే ఈ రీమేక్ కు న్యాయం చేయగలడు అనుకుని అతని చేతుల్లో ఈ సినిమా పెట్టారట. రానా, రవితేజ మల్టీస్టారరే క్రేజీగా మారుతుండగా ఈ మూవీకి సుధీర్ వర్మ డైరక్షన్ కూడా హైలెట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. సినిమాకు సంబందించిన షూటింగ్ ఆగష్టులో మొదలవుతుందని తెలుస్తుంది.