
నందమూరి బాలకృష్ణ 60వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సినీ ప్రముఖులు బాలయ్య బాబుకి బర్త్ డే శుభాకాంక్షలు అందించారు. మొదటగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబాయ్ బాలకృష్ణకు స్పెషల్ విషెస్ అందించారు. నాలో అభిమానిని తట్టిలేపింది మీరే.. నాకు ఊహ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో మీరే.. ఈ 60వ పుట్టినరోజు మరపురానిది కావాలని.. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేయగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఆయన ఎనర్జీకి పవర్ హౌజ్ లాంటోడు అంటూ బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా మా బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఈమధ్య సినీ ప్రముఖులంతా తెలంగాణా ప్రభుత్వంతో జరిగిన చర్చలకు తనని పిలవలేదని అలిగి మీడియా ముందే తనని పిలవలేదని చెప్పిన బాలకృష్ణ ఆ తర్వాత పలు ఇంటర్వ్యూస్ లో కూడా ఈ విషయంపై అసంతృప్తి వెళ్లడించారు. అయినా సరే పట్టించుకోకుండా బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చిరు ట్వీట్ చేయడం నందమూరి ఫ్యాన్స్ కు సైతం షాక్ ఇచ్చింది.