
బోయపాటి శ్రీను, బాలకృష్ణ సినిమా అంటే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అంచనా వేయొచ్చు. టాలీవుడ్ లో ఊర మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను.. అదే తరహా సినిమాలు తీసే నందమూరి బాలకృష్ణ కలిసి ఇప్పటివరకు 2 సినిమాలు చేశారు. సింహా, లెజెండ్ రెండు మంచి హిట్ సినిమాలుగా నిలిచాయి. ఇక లేటెస్ట్ గా వాళ్లిద్దరూ కలిసి హ్యాట్రిక్ మూవీ చేస్తున్నారు. బిబి 3 ఫస్ట్ రోర్ అంటూ లేటెస్ట్ గా ప్రమోషన్స్ మొదలుపెట్టిన ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ వచ్చింది.
పంచె కట్టులో బాలయ్య మాస్ డైలాగ్ చెప్పడం.. అక్కడితో ఊరుకోకుండా తన పంజా విసరడం యాజిటీజ్ ఓ మాస్ సినిమా తరహా టీజర్ ఎలా ఉంటుందో దానికి ఏమాత్రం చేశాడు బోయపాటి. ఇలా టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై అంచనాలు పెంచడంలో బోయపాటి శ్రీను కూడా వర్మ స్టైల్ ఫాలో అవుతున్నాడు. బిబి 3 సినిమా ఫస్ట్ రోర్ ఎప్పటిలానే అదిరిపోయింది. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సినిమా టీజర్ వదిలిన చిత్రయూనిట్ టైటిల్ ఎనౌన్స్ చేయలేదు. అంటే టైటిల్ లో ఏదో సీక్రెట్ ఉందన్నమాట. మాములుగా బాలకృష్ణ సినిమాలు టైటిల్ విషయంలో పెద్ద హంగామా ఉండదు. మరి బిబి 3 ఎందుకు టైటిల్ సీక్రెట్ గా ఉంచుతున్నారో తర్వాత తెలుస్తుంది.