
మలయాళంలో సూపర్ హిట్టైన అయ్యప్పనుమ్ కోషియం సినిమా తెలుగు రీమేక్ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. సాచి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ చేస్తుందని తెలుస్తుంది. బాలకృష్ణ, రానా కలిసి చేస్తారని అనుకున్న ఈ ప్రాజెక్ట్ పై బాలకృష్ణ అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో మాస్ మహారాజ్ రవితేజ లైన్ లోకి వచ్చాడు. సినిమాలో పృథ్వి రాజ్ పాత్రకు రానా పర్ఫెక్ట్ షూట్ అవుతాడని అనిపించగా బిజూ మీనన్ పాత్రకు ఓ మిడిల్ ఏజ్ హీరో కావాల్సి ఉంటుంది.
మొదట్లో బాలయ్య ప్లేస్ లో వెంకటేష్ అయినా పర్వాలేదు అనుకున్నారు. కానీ ఫైనల్ గా ఈ రీమేక్ లో రవితేజ నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రవితేజ, రానా ఇద్దరు టాలెంటెడ్ హీరోల మధ్య జరిగే ఈగో ఫైట్ తెర మీద అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమా చేస్తుండగా ఆ తర్వాత రమేష్ వర్మ డైరక్షన్ లో సినిమా చేయాల్సి ఉంది. రానా కూడా విరాటపర్వం పూర్తి చేసి నెక్స్ట్ సినిమా ప్లాన్ లో ఉన్నాడు. మరి రవితేజ, రానా తెలుగు అయ్యప్పనుమ్ కోషియం చేస్తే మాత్రం ఖచ్చితంగా సెన్సేషనల్ హిట్ అవుతుందని చెప్పొచ్చు. మరి ఈ ప్రాజెక్ట్ తెలుగులో ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది తెలియాల్సి ఉంది.