
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రీసెంట్ గా క్లైమాక్స్ తో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా వచ్చిందో లేదో మరో బోల్డ్ మూవీని సిద్ధం చేశాడు. నగ్నం అంటూ మరో అడల్ట్ కాన్సెప్ట్ మూవీ చేస్తున్నాడు ఆర్జీవీ. సినిమా ఏదైనా తన కెమెరా యాంగిల్, టేకింగ్ తో ఆకట్టుకునే వర్మ నగ్నం ట్రైలర్ తో షాక్ ఇచ్చాడు. అమ్మాయి అందాలను కెమెరా బందించాలంటే అది వర్మ తర్వాతే అనేలా ఈ నగ్నం ట్రైలర్ ఉంది.
ట్రైలర్ లో కాన్సెప్ట్ తెలియడం లేదు కానీ క్లైమాక్స్ లానే ఈ సినిమాను కూడా ఆర్జీవీ వరల్డ్, శ్రేయాస్ ఈటి ద్వారా రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. అంతేకాదు క్లైమాక్స్ సినిమాకు 100 రూపాయలు పే పర్ వ్యూ పెట్టిన వర్మ ఈసారి నగ్నత్వానికి 200 రూపాయలు ఫిక్స్ చేశాడు. క్లైమాక్స్ ను కూడా ట్రైలర్ లో ఏదో ఉందన్నట్టు బిల్డప్ ఇచ్చి సినిమాను చెత్తగా తీసిన వర్మ ఈ నగ్నం సినిమాలో అయినా ఏదైనా కథ చెబుతాడా లేక హీరోయిన్ అందాల మీద నడిపిస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.