స్టార్ట్ కెమెరా యాక్షన్

కరోనా వల్ల లాక్ డౌన్ కారణంగా కొన్నాళ్లుగా షూటింగ్స్ క్యాన్సిల్ కాగా ప్రభుత్వంతో సినీ పెద్దల చర్చల అనంతరం తెలంగాణా సీఎం కేసీఆర్ షూటింగ్స్ కు పర్మిషన్ ఇస్తూ ఆర్డర్స్ పాస్ చేశారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ చేయాలని చెప్పారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి సినీ ప్రముఖులు తమ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆల్రెడీ సీఎం కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేయగా లేటెస్ట్ గా దర్శకధీరుడు రాజమౌళి కూడా సీఎం కేసీఆర్ కు థాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. ఇక మీదట  ఉందని మెసేజ్ చేశారు రాజమౌళి. 

ఐతే థియేటర్లు ఓపెన్ పై మాత్రం కేంద్రం నుండి పర్మిషన్ రావాల్సి ఉంది. సినిమా హాళ్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారన్న విషయం మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్స్ వరకు తగిన జాగ్రత్తలతో చేసుకున్నా.. సినిమా హాళ్లు మాత్రం ఇప్పుడప్పుడే  పరిస్థితి కనిపించడం లేదు.