
కింగ్ నాగార్జున, ధనుష్ కాంబోలో కోలీవుడ్ దర్శకత్వంలో రుద్ర సినిమా అప్పట్లో భారీ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. 80 కోట్ల భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే సినిమా స్టార్ట్ అవ్వటానికి ముందే బడ్జెట్ గురించి భయపడ్డ నిర్మాతలు ఆ ప్రాజెక్ట్ ను ఆపేశారు. దాదాపు ఆ సినిమా అటకెక్కింది అనుకున్నారు.
లేటెస్ట్ గా ధనుష్ మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ను కదిలించే పనిలో ఉన్నాడట. అప్పుడు ఓకే అనుకున్న నిర్మాతలతోనే కొద్దిగా బడ్జెట్ కంట్రోల్ చేసి కొత్తగా బడ్జెట్ వేశాడట. ఈ సినిమాకు రుద్ర టైటిల్ ఫిక్స్ కూడా ధనుష్ తో మూవీకి ఎప్పుడైనా రెడీ అని చెప్పడంతో మళ్ళీ కోలీవుడ్ లో ఈ సినిమాపై వార్తలు వస్తున్నాయి. హీరోగానే కాదు దర్శకుడిగా ధనుష్ తన ప్రతిభ చూపించేందుకు రెడీ అవుతుండగా రుద్రపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా గురించి మిగతా డీటెయిల్స్ త్వరలో బయటకు వస్తాయి.