
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ఫస్ట్ లుక్ ఈరోజు రాత్రి 7 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. సింహా,లెజెండ్ సినిమాల తర్వాత బాలయ్య బాబు, బోయపాటి శ్రీను కలిసి చేస్తున్న ఈ సినిమాపై ఉన్నాయి. జూన్ 10 నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందే ఫ్యాన్స్ కు స్పెషల్ సర్ ప్రయిజ్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. అందుకే బిబి 3 ఫస్ట్ రోర్ ఈరోజు రాత్రి 7 గంటలకు రిలీజ్ ప్రకటించారు.
మిర్యాల రవీంద్ర రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. మాములుగా అందరు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు.. కానీ బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబో కాబట్టి వీరి హ్యాట్రిక్ మూవీ నుండి ఫస్ట్ గర్జన రాబోతుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో బాలకృష్ణ ఒక పాత్రలో అఘోరాగా కనిపిస్తాడని తెలుస్తుంది. భారీ అంచనాలతో తెరకెక్కే ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందో చూడాలి.