
మంచు ఫ్యామిలీ హీరో విష్ణు హీరోగా కమర్షియల్ సక్సెస్ అందుకున్న సినిమా ఢీ. శ్రీను వైట్ల డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. విష్ణు సరసన జెనీలియా నటించిన ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చి ప్రేక్షకులను నవ్వించింది. ఇక ఈ సినిమాకు సీక్వల్ గురించి కొన్నాళ్లుగా వార్తలు వస్తుండగా ఫైనల్ గా శ్రీను వైట్ల ఢీ సీక్వల్ రెడీ చేస్తున్నాడట. ఈ సీక్వల్ కు టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.
డైరక్టర్ గా కెరియర్ లో వెనుకపడ్డ శ్రీను వైట్ల ఈ సూపర్ హిట్ సీక్వల్ తో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమా సీక్వల్ కు ఢీ అండ్ ఢీ అని పెట్టబోతున్నారట. ఢీ అండ్ ఢీ అంటే డేరింగ్ అండ్ డ్యాషింగ్ అన్నమాట. ఈ మూవీని విష్ణు నిర్మిస్తారని తెలుస్తుంది. ఢీ సీక్వల్ గా వస్తున్న ఈ సినిమా ఆ సినిమా అందుకుంటుందో లేదో చూడాలి. ఈ సీక్వల్ లో కూడా బ్రహ్మానందం కామెడీ హైలెట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట.