
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అప్పట్లో సుబ్బిరామిరెడ్డి చిరు, పవన్ మల్టీస్టారర్ సినిమా త్రివిక్రమ్ డైరక్షన్ లోనే వస్తుందని ఎనౌన్స్ చేశాడు. ఎనౌన్స్ అయితే భారీగానే చేశాడు కానీ ఆ సినిమా ఇంతవరకు పట్టాలెక్కలేదు. చిరు మళ్ళీ సినిమాలతో బిజీ అవగా పవన్ ఫుల్ టైం రాజకీయాల్లో బిజీగా మారాడు.
వకీల్ సాబ్ తో మళ్ళీ సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ అన్నయ్యతో కలిసి చేసే ఆలోచన లేదన్నట్టు తెలుస్తుంది. అయితే పవన్ చేయకపోయినా చిరు, త్రివిక్రమ్ కాంబోలో ఒక సినిమా రాబోతుందని తెలుస్తుంది. అల వైకుంఠపురములో సూపర్ సక్సెస్ అందుకున్న త్రివిక్రమ్ ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. తారక్ సినిమా తర్వాత త్రివిక్రమ్ మెగాస్టార్ తో మెగా మూవీ ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత దర్శకులను లైన్ లో పెట్టగా వారికన్నా ముందు త్రివిక్రమ్ తోనే సినిమా ఉంటుందని తెలుస్తుంది. చిరు నటించిన జై చిరంజీవా సినిమాకు మాటలు రాసిన త్రివిక్రమ్ డైరక్షన్ లో మెగాస్టార్ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.