
రాజమౌళి డైరక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్. బాహుబలి రాజమౌళి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో అజయ్ దేవగన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుండగా.. ఆలీయా భట్, ఒలీవియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమా నుండి ఎలాంటి క్లూస్ రాకుండా జాగ్రత్తపడుతున్న రాజమౌళికి షాక్ ఇచ్చింది శ్రీయ.
సౌత్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ ఇప్పటికి వరుస సినిమాలు చేస్తుంది. ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో తాను కూడా ఆర్.ఆర్.ఆర్ లో ఉన్నానని చెప్పింది. అంతేకాదు క్లైమాక్స్ ఎపిసోడ్స్ లో తాను కనిపిస్తానని లీక్ చేసింది. సినిమా గురించి ఎలాంటి లీక్స్ రాకున్నా జాగ్రత్తపడుతున్న జక్కన్నకు ఆర్.ఆర్.ఆర్ గురించి బయట పెట్టి శ్రీయ షాక్ ఇచ్చింది. దీనిపై రాజమౌళి సీరియస్ గా ఉన్నాడని తెలుస్తుంది. 2021 జనవరి 8న సినిమా రిలీజ్ అనుకుంటుండగా లాక్ డౌన్ వల్ల షూటింగ్ వాయిదా పడటంతో అనుకున్న టైం కు సినిమా రావడం కష్టమే అంటున్నారు.