
అల వైకుంఠపురములో సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నాడు. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత షూటింగ్ కు వెళ్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా చేస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. కెరియర్ లో మొదటిసారి అల్లు అర్జున్ ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు.
సోషల్ మీడియా ఫాలోయింగ్ లో కూడా టాప్ లేపుతున్న అల్లు అర్జున్ లేటెస్ట్ గా మరో రేర్ ఫీట్ సాధించాడు. ఇన్ స్టాగ్రామ్ లో 7 మిలియన్ ఫాలోవర్స్ తో అల్లు అర్జున్ తన సత్తా చాటాడు. సౌత్ లో ఇన్ స్టాగ్రామ్ లో ఈ రేంజ్ ఫాలోవర్స్ కలిగిన ఏకైక హీరో అల్లు అర్జున్ మాత్రమే అని చెప్పొచ్చు. తెలుగులోనే కాకుండా అల్లు అర్జున్ కు మలయాళంలో కూడా సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ అల్లు అర్జున్ ను మల్లు అర్జున్ అని ముద్దుగా పిలుచుకుంటారు. అందుకే సౌత్ లో ఏ హీరోకి లేని ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ అల్లు అర్జున్ కి ఉన్నారు. పుష్పతో బాలీవుడ్ ఆడియెన్స్ ను ఫిదా చేసి నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు అల్లు అర్జున్.