
అక్కినేని మనం చూశాక సినీ నేపథ్యం ఉన్న హీరోలంతా కలిసి అలాంటి మల్టీస్టారర్ సినిమా కథ కోసం ఎదురుచూశారు. మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ మల్టీస్టారర్ కథల కోసం వేట కొనసాగుతూనే ఉంది. వీటిలో నందమూరి హీరోలు కలిసి చేసే సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఎక్సయిటింగ్ గా ఉన్నారు. అయితే లేటెస్ట్ గా నందమూరి మల్టీస్టారర్ పై ప్రస్తావన తెచ్చారు బాలకృష్ణ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో కలిసి సినిమా చేసే అవకాశం ఉందని సరైన కథ దొరికితే మేమంతా కలిసి చేయడానికి సిద్ధమని అన్నారు బాలయ్య బాబు.
ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్న బాలకృష్ణ ఆ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నారని తెలుస్తుంది. బోయపాటి డైరక్షన్ లో సింహా,లెజెండ్ సినిమాలు చేసిన బాలకృష్ణ హ్యాట్రిక్ మూవీతో కూడా హ్యాట్రిక్ హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. బాలకృష్ణ, ఎన్టీఆర్ కలిసి సినిమా చేస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడం ఖాయం. ఎన్టీఆర్, బాలకృష్ణ ఇద్దరు ఒకేసారి తెర మీద కనిపిస్తే నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పొచ్చు.