15 మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై కేసు..!

తెలుగు, హిందీ భాషల్లో నటించిన మీరా చోప్రా ఓ ఇంటర్వ్యూలో తనకు మహేష్ అంటే ఇష్టం ఎన్టీఆర్ అంటే ఇష్టం లేదని చెప్పడంతో నందమూరి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఆమెను బూతులతో ట్రోల్స్ చేశారు. అయితే వీటిని సీరియస్ గా తీసుకున్న మీరా చోప్రా ఎన్టీఆర్ కు ట్యాగ్ చేసి ఇలాంటి ఫ్యాన్స్ తో వచ్చిన స్టార్ డం ఎందుకు అంటూ ఎన్టీఆర్ ను డైరెక్ట్ గా ప్రశ్నించింది. ఇక ఈ విషయంలో సరైన యాక్షన్ తీసుకోవాలని కెటిఆర్ కు రిక్వెస్ట్ చేసింది మీరా చోప్రా. 

మీరా చోప్రా ట్వీట్ కు స్పందించిన కెటిఆర్, డిజిపిని యాక్షన్ లోకి దిగాలి అన్నారు. వెంటనే రంగంలో దిగిన క్రైమ్ పోలీస్ మీరా చోప్రాని ట్రోల్ చేసిన 15 మంది ట్విట్టర్ ఖాతాలను కనుగొన్నారు. వారిపై లీగల్ యాక్షన్ తీసుకోనున్నారు.