
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బోయపాటి శ్రీను డైరక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని వార్తలు రాగా అది జరగలేదు.. క్రిష్ డైరక్షన్ లో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఉంటుందని వార్తలు రాగా అవి కూడా రూమర్స్ అని తెలిశాయి. కొన్నాళ్ళు మోక్షజ్ఞకు అసలు సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదని కూడా వార్తలు రాశారు. లేటెస్ట్ గా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై బాలకృష్ణ కూడా నోరు విప్పాడు. మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని చెప్పారు బాలయ్య బాబు.
ఇక లేటెస్ట్ న్యూస్ ప్రకారం మోక్షజ్ఞ ఓ స్టార్ రైటర్ డైరక్షన్ లో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగులో సూపర్ ఫామ్ లో ఉన్న సాయి మాధవ్ బుర్ర తన పెన్ పవర్ తో సత్తా చాటుతున్నాడు. శాతకర్ణి సినిమా నుండి లాస్ట్ ఇయర్ వచ్చిన సైరా నరసింహా రెడ్డి సినిమా వరకు రైటర్ గా తన ప్రతిభ కనబరచిన సాయి మాధవ్ మోక్షజ్ఞకు సరిపోయే ఓ కథ రెడీ చేశాడట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.