ఉప్పెన ఫైనల్ రన్ టైం ఫిక్స్..!

మెగా ఫ్యామిలీ నుండి రాబోతున్న మరో హీరో వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ఉప్పెన. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ కలిసి నిర్మిస్తున్నారు. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా.. రిలీజైన రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఉప్పెన సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. 

లాక్ డౌన్ లేకపోతే ఏప్రిల్ 2నే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా రిలీజ్ వాయిదా పడ్డది. ఎలాగూ రిలీజ్ కు టైం ఉంది కదా అని సుకుమార్ ఈ సినిమా రన్ టైం తగ్గించే బాధ్యతా మీద వేసుకున్నాడు. అంతకుముందు దగ్గర దగ్గరగా 3 గంటల దాకా ఉన్న ఈ సినిమాను సుకుమార్ దగ్గర ఉంది రెండున్నర గంటలకు ఫైనల్ కట్ చేశాడట. ఈ సినిమాలో కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడు. సినిమా టీజర్, సాంగ్స్ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. మరి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.